Type Here to Get Search Results !

చికెన్ పకోడీ - Chicken Pakodi

 చికెన్ పకోడీ:

కావలసిన పదార్థాలు:

చికెన్ : 500 గ్రాములు

సెనగపిండి : 600గ్రాములు

నిమ్మరసం : నాలుగు స్పూన్‌లు

ఆవాలపొడి : మూడు స్పూన్‌లు

కారం : రెండు స్పూన్‌లు

నెయ్యి : 250 గ్రాములు

ఉప్పు : కావలసినంత

వెనిగర్ : ఒకస్పూన్


తయారీ విధానం:

శుభ్రం చేసిన చికెన్‌కు ఉడికించి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోండి.

చికెన్ ముక్కలకి నిమ్మరసం, వెనిగర్‌ను కలిపి రెండు గంటల పాటు ఊరనివ్వండి.

సెనగపిండిని తీసుకుని అందులో కొంచెం ఉప్పు కలుపుకుని పలచగా కలుపుకోవాలి.

ఊరిన చికెన్ ముక్కల్ని పిండేసి వేరొక పాన్‌లో వాటిని తీసుకోండి.

సెనగపిండిలో మసాలాపొడిని కలుపుకోండి.

సెనగపిండి మిశ్రమంలో చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ముంచి నేతిలోగానీ, నూనెలోగానీ బ్రౌన్‌కలర్ వచ్చే వరకు వేపించి దించితే చికెన్ పకోడి రెడీ.