Type Here to Get Search Results !

చింత చిగురు మాంసం - Chinta Chiguru Mamsam

 చింత చిగురు మాంసం:

కావలసిన పదార్థాలు :

చింత చిగురు - అరకిలో

మాంసం - అరకిలో (చికెన్ లేదా మటన్)

కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు

కొత్తిమీర - కట్ట

ధనియాల పొడి - టీస్పూన్

అల్లం వెల్లుల్లి ముద్ద - టీస్పూన్

జీలకర్ర - టీస్పూన్

పుదీనా - కట్ట

ఆవాలు - టీస్పూన్

నూనె - టేబుల్ స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

కారం - 2 టీస్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - చిటికెడు

గరం మసాలా - టీస్పూన్


తయారుచేసే పద్ధతి :

నాన్ స్టిక్ పాన్ స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు కూడా వేసి వేయించాలి. అవి వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్ లేదా చికెన్ వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి. ఉడికిన తర్వాత చింత చిగురు వేసి మరో ఐదు నిముషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఒక నిమిషం ఉంచి దించాలి.